కష్టపడి పనిచేస్తే బీజేపీలో గుర్తింపు లభిస్తుందనడానికి ఈ పదవే నిదర్శనం: ఎంపీ శ్రీనివాసవర్మ
- నరసాపురం లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరపున గెలిచిన శ్రీనివాసవర్మ
- వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు
- కార్యకర్తగా ప్రస్థానం ఆరంభించానన్న వర్మ
బీజేపీలో ఓ కార్యకర్తగా తన ప్రస్థానం మొదలైందని, గత 34 ఏళ్లుగా పార్టీతో నడుస్తున్నానని శ్రీనివాసవర్మ వెల్లడించారు. నరసాపురం లోక్ సభ టికెట్ వచ్చినప్పుడు, కార్యకర్తలు గెలుపుపై తనకు భరోసా ఇచ్చారని తెలిపారు.
తన విజయం కోసం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు కృషి చేశారని, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. తనకోసం రాయలసీమ నుంచి కూడా వచ్చి ప్రచారం చేశారని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ఇప్పటివరకు సహకరించి, ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.