మోదీ కేబినెట్లో చోటు... నటుడు సురేశ్ గోపి మరో మైలురాయి
- త్రిస్సూర్ నుంచి గెలిచిన సురేశ్ గోపి
- కేరళలో మొదటిసారి విజయం సాధించిన బీజేపీ
- 'త్రిస్సూర్‌కు మోదీ హామీ' అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లిన సురేశ్ గోపి
సురేశ్ గోపి మలయాళ నటుడు. 250కి పైగా చిత్రాల్లో నటించారు. 2016 ఏప్రిల్ లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిస్సూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఎంపీగా గెలిచి లోక్ సభలో అడుగుపెట్టనున్నారు.