రామోజీ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు వీరే
- నిన్న తెల్లవారుజామున కన్నమూసిన రామోజీరావు
- రామోజీ ఫిలింసిటీలో అంత్యక్రియలు పూర్తి
- పాడెమోసిన చంద్రబాబునాయుడు
- హాజరైన నారా లోకేశ్, ఎర్రబెల్లి, జూపల్లి, వీహెచ్ వంటి ప్రముఖులు
ఈ ఉదయం జరిగిన రామోజీ అంత్యక్రియల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నారా లోకేశ్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నామా నాగేశ్వర్రావు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. అంత్యక్రియలకు హాజరైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. రామోజీరావు పాడె మోశారు.