అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్‌కు మరో షాక్!
- పాక్ పేసర్ హారీస్ రౌఫ్‌పై 'బాల్ ట్యాంపరింగ్' ఆరోపణలు
- మ్యాచ్ సమయంలో రౌఫ్ బంతిని గీకాడన్న అమెరికా సీనియర్ జట్టు సభ్యుడు
- ఐసీసీని ట్యాగ్ చేసి ఎక్స్ వేదికగా ఆరోపణ
మ్యాచ్ సమయంలో రౌఫ్ తన గోళ్లతో కొత్త బంతిని గీకాడని, అమెరికన్ బ్యాటర్లను ఔట్ చేయాలని భావించాడని పేర్కొన్నాడు. ‘‘ఐసీసీ.. కొత్తగా తీసుకున్న బంతిని పాకిస్థాన్ గీకడం లేదని అంటూ మేము నటించాలా? 2 ఓవర్ల క్రితమే మార్చిన బంతిని తిప్పి పంపించడానికా? హారిస్ రౌఫ్ తన బొటనవేలుని బంతిపై గీకడం మీరే చూడవచ్చు’’ అని రస్టీ థెరాన్ పేర్కొన్నాడు. కాగా ఈ ఘటనపై అమెరికా టీమ్ అధికారికంగా ఐసీసీకి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కాగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన రౌఫ్ 37 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు.