మంత్రివర్గంలో లోకేశ్‌కు కీలక బాధ్యతలు.. చంద్రబాబు నిర్ణయం!
- టీడీపీ విజయంలో లోకేశ్ కీలక పాత్ర
- లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు చంద్రబాబు నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం
- గతంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న లోకేశ్
- ఈమారు మరిన్ని కీలక బాధ్యతలు దక్కే అవకాశం
ఈ నేపథ్యంలో చంద్రబాబు లోకేశ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో లోకేశ్‌కు భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారట. లోకేశ్ గతంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి ప్రభుత్వంలో మరింత కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.