గుండెపోటుతో వ్యక్తి మృతి.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు!
- మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో ఘటన
- మెడ్‌ప్లస్ ఫార్మసీలో పని చేస్తున్న మురళికి గుండెపోటు
- ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి
ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న మెడ్‌ప్లస్ ఫార్మసీలో పని చేస్తున్న మురళి గుండెపోటుతో మరణించాడు. షాపునకు వచ్చిన కస్టమర్లకు మందులు ఇచ్చి.. బిల్లింగ్ చేస్తున్న సమయంలో మురళికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దాంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందాడు.