Chegondi Harirama Jogaiah: కూట‌మి విజ‌యం.. ప‌వ‌న్‌కు హ‌రిరామ జోగ‌య్య లేఖ‌

Harirama Jogaiah letter to Janasena Party Chief Pawan Kalyan
  • పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ప‌వ‌న్‌కు కాపు నేత‌ శుభాకాంక్ష‌లు
  • ధ‌ర్మ, నీతివంత‌మైన పాల‌న‌తో ముందుండి న‌డిపించాల‌ని జ‌న‌సేనానికి సూచన‌
  • ప్ర‌ధానంగా జాతికి మంచి పేరు తీసుకొచ్చేలా పాల‌న కొన‌సాగించాల‌ని హిత‌వు
కాపు నేత హ‌రిరామ జోగ‌య్య ఏపీలో కూట‌మి విజ‌యంపై తాజాగా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు లేఖ రాశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జ‌న‌సేనానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 

ఈ సంద‌ర్భంగా రాజ్యాధికారంలో భాగ‌స్వామిగా ధ‌ర్మ పాల‌న‌, నీతివంత‌మైన పాల‌న‌తో ముందుండి న‌డిపించాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా జాతికి మంచి పేరు తీసుకొచ్చేలా పాల‌న కొన‌సాగించాల‌ని ఆకాంక్షించారు. 

ఇక మంగ‌ళ‌వారం వెలువ‌డిన ఫ‌లితాల్లో జ‌న‌సేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌స‌భ స్థానాల్లోనూ విజ‌యం సాధించి సంచ‌ల‌నం సృష్టించింది. అటు ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురంలో స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి వంగా గీత‌పై 70వేల‌కు పైగా మెజారిటీతో ఘ‌న విజ‌యం సాధించారు.
Chegondi Harirama Jogaiah
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News