Ntr: 'దేవర'కి పోటీగా దిగుతున్న 'వేట్టైయాన్'

Devara mOvie Update
  • ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'దేవర'
  • ఆయన జోడీ కట్టిన జాన్వీ కపూర్ 
  • దసరాకి రిలీజ్ అవుతున్న సినిమా 
  • అదే రోజున రానున్న రజనీ 'వేట్టైయన్'  

ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా రూపొందుతోంది. మిక్కిలినేని సుధాకర్ - కొసరాజు హరికృష్ణ ఈ సినిమాకి నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయమవుతోంది. ఇక ప్రతి నాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. 
  
అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడు కనుక, వసూళ్ల పరంగా ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని అంతా భావించారు. అయితే ఇప్పుడు అదే డేట్ కి రజనీకాంత్ రంగంలోకి దిగుతున్నారు. 

రజనీకాంత్ హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టైయాన్' సినిమా రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది. రజనీకాంత్ బాడీ లాంగ్వేజ్ కి తగిన కంటెంట్ ఇది. అమితాబ్ .. ఫహాద్ ఫాసిల్ .. రానా వంటి బలమైన తారాగణం ఉన్న సినిమా ఇది. ఇక ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడు అనిరుధ్ కావడం విశేషం. తమ సినిమా కూడా అక్టోబర్ 10వ తేదీన వస్తుందని రజనీ క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Ntr
Janhvi Kapoor
Rajanikantha
Rana
Sai Ali Khan

More Telugu News