'కల్కి' ట్రైలర్ విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..!
- జూన్ 10వ తేదీన మూవీ ట్రైలర్ రిలీజ్
- ఈ మేరకు చిత్రం యూనిట్ అధికారిక ప్రకటన
- ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'కల్కి 2898 ఏడీ'
- నాగ్ అశ్విన్ దర్శకత్వం.. వైజయంతి మూవీస్ నిర్మాణం
ఇక ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో ట్రైలర్ విడుదల తారీఖును మేకర్స్ తాజాగా ప్రకటించారు. జూన్ 10వ తేదీన మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు అధికారికంగా చిత్రం యూనిట్ ప్రకటించింది. కాగా, ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ముంబైలో జరగనుందని సమాచారం.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై కే. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.