Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు విజయతిలకం దిద్దిన అన్నా లెజ్నెవా... వీడియో వైరల్!

Anna Lezneva give traditional sendoff to Pawan Kalyan while he leaving to Mangalagiri
  • పిఠాపురం విజేతగా పవన్ కల్యాణ్
  • వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గెలుపు
  • హైదరాబాద్ నుంచి మంగళగిరి బయల్దేరి పవన్ కల్యాణ్
  • హారతి ఇచ్చి సాగనంపిన అన్నా లెజ్నెవా
జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై నెగ్గడం తెలిసిందే. విజయోత్సాహంలో ఉన్న పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి మంగళగిరి బయల్దేరారు. ఈ క్రమంలో, పవన్ కల్యాణ్ కు ఆయన భార్య అన్నా లెజ్నెవా విజయతిలకం దిద్దారు. హారతి ఇచ్చి పవన్ కల్యాణ్ ను సాగనంపారు. పక్కనే పవన్ తనయుడు అకీరా కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Pawan Kalyan
Anna Lezneva
Pithapuram
Janasena
Mangalagiri
Hyderabad
Andhra Pradesh

More Telugu News