ఈ ఎన్నికల్లో తొలి గెలుపు రుచి చూసిన జనసేన... రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ విక్టరీ
- రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ ఘనవిజయం
- 34,049 ఓట్ల మెజారిటీతో వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై విక్టరీ
- విజయోత్సవాలు జరుపుకుంటున్న జనసేన శ్రేణులు
మొత్తం 16 రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం జనసేన అభ్యర్థి బలరామకృష్ణకు 1,05,995 ఓట్లు రాగా... వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాకు 71,946 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ముండ్రు వెంకట శ్రీనివాస్ (పెదబాబు)కు 1,901 ఓట్లు వచ్చాయి.