Chandrababu: సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.. ఎక్క‌డ‌, ఎప్పుడంటే..!

Chandrababu Naidu took oath as AP CM on June 9th
  • ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూట‌మి క్లీన్‌స్వీప్
  • ప్ర‌స్తుతం 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థుల లీడ్‌
  • టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు
  • జూన్ 9న అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూట‌మి క్లీన్‌స్వీప్ దిశ‌గా కొనసాగుతుండ‌డంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం అంశంపై చర్చలు మొదలయ్యాయి. ప్ర‌స్తుతం 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నార‌ని స‌మాచారం. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

కాగా, వైసీపీ గెలుస్తుందని తొమ్మిదో తేదిన విశాఖలో జగన్ ప్రమణస్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ గెలుస్తుందని.. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణం చేస్తారని ఆ పార్టీ నేతలు కౌంట‌ర్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యమైన ఫ‌లితాలు రావ‌డంతో అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు.
Chandrababu
AP CM
TDP
Andhra Pradesh
AP Politics

More Telugu News