ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
- నేడు కౌంటింగ్
- లోక్ సభ, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
- ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్
- మొదట పోస్టల్ బ్యాలెట్లు, 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు
ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వస్తే డ్రా ద్వారా విజేతను నిర్ణయించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులను మోహరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.