దర్శకుడు సానా బుచ్చిబాబును పరామర్శించిన నాగబాబు

Nagababu visits Tollywood director Sana Butchibabu
  • ఇటీవల సానా బుచ్చిబాబుకు పితృవియోగం
  • నేడు పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి గ్రామానికి వెళ్లిన నాగబాబు
  • సానా బుచ్చిబాబును కలిసిన వైనం
టాలీవుడ్ దర్శకుడు సానా బుచ్చిబాబుకు ఇటీవల పితృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి సానా వెంకట్రావు(పెద్ద కాపు) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి గ్రామంలో సానా బుచ్చిబాబు నివాసానికి వెళ్లారు. 

బుచ్చిబాబును పరామర్శించి, ఆయన తండ్రి వెంకట్రావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నాగబాబు వెంట సానా బుచ్చిబాబు నివాసానికి వచ్చిన వారిలో జనసేన నేతలు డాక్టర్ పంచకర్ల సందీప్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Go Back to Shorts
Nagababu
Sana Butchibabu
Pithapuram
Janasena
Tollywood
Andhra Pradesh

More Telugu News