Telangana Polycet Results: తెలంగాణ పాలిసెట్ ఫ‌లితాల విడుద‌ల‌

Telangana Polycet Results Released
  • ఫ‌లితాలను విడుద‌ల చేసిన‌ విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ బుర్రా వెంక‌టేశం
  • డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24న పాలిసెట్‌ పరీక్ష నిర్వ‌హ‌ణ‌
  • రాష్ట్ర‌వ్యాప్తంగా 82, 809 మంది విద్యార్థుల హాజ‌రు
తెలంగాణ పాలిసెట్ ఫ‌లితాలను విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ బుర్రా వెంక‌టేశం విడుద‌ల చేశారు. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24న పరీక్ష నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 49 ప‌రీక్ష కేంద్రాల్లో కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ఈ ప‌రీక్ష‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఇక పరీక్షకు హాజరైన విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఫ‌లితాల‌ను చెక్‌ చేసుకోవ‌చ్చు.

విద్యార్థులు ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోవ‌చ్చు..
* ఇందుకోసం విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్‌ పేజీలో కనిపించే ర్యాంక్‌ కార్డ్‌పై క్లిక్‌ చేయాలి.
* అక్కడ హాల్‌ టికెట్ నెంబర్‌ను ఎంటర్‌ చేసి సబ్‌మిట్ బటన్‌పై నొక్కాలి. వెంటనే ర్యాంక్‌ కార్డు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
Telangana Polycet Results
Telangana

More Telugu News