ప్రియుడితో కలిసి బయటకు వచ్చిన ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం

  • విజయనగరం జిల్లాలో ఘటన
  • ఏకాంతం కోసం ఊరి చివరకు వెళ్లిన ప్రేమికులు
  • డబ్బులు డిమాండ్ చేసిన హోంగార్డ్
  • ఇచ్చాక, యువతిపై లైంగికదాడి
ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమ జంటను బెదిరించి యువకుడిని బంధించి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో హోంగార్డు. విజయనగరం జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రేమికులు ఏకాంతం కోసం గ్రామ శివారులోకి వెళ్లారు. అక్కడ వారిని చూసిన హోంగార్డు రాజ్‌కుమార్.. పోలీసు వాహనంతో వెళ్లి స్టేషన్‌కు రావాలని బెదిరించాడు. దీంతో తమను వదిలేయాలని వారు ప్రాధేయపడగా డబ్బులు డిమాండ్ చేశాడు.

వారు తమ వద్దనున్న డబ్బులు ఇవ్వడంతో తీసుకున్న రాజ్‌కుమార్‌ ఆపై యువకుడిని బంధించి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితులు నిన్న దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు రాజ్‌కుమార్‌ది విజయనగరం కాగా, ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ డీఎస్పీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఘటన సమయంలో అతడి వెంట మరో వ్యక్తి కూడా ఉన్నట్టు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Crime News
Vizianagaram
Home Guard

More Telugu News