విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన సీఎం జగన్

  • ముగిసిన పదిహేను రోజుల పర్యటన
  • ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న జగన్ ఫ్యామిలీ
  • ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. కుటుంబంతో పాటు మే 17న లండన్ వెళ్లిన జగన్.. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. పార్టీ అధినేతకు స్వాగతం చెప్పేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు ఎయిర్ పోర్ట్ బయట బారులు తీరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్ఫగుచ్ఛాలతో సీఎం జగన్ కు స్వాగతం పలికారు. పదిహేను రోజుల పాటు సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి లండన్, స్విట్జర్లాండ్ లలో పర్యటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఆయన లండన్ వెళ్లారు.

కాగా, విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు పార్టీ నేతలతో జగన్ భేటీ కానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నట్లు వెల్లడించాయి. తాను విదేశీ పర్యటనలో ఉన్న ఈ పదిహేను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలపైనా చర్చ జరుపుతారని సమాచారం.


More Telugu News

CM Jagan Foreign Tour Gannavaram Vijayawada YSRCP Andhra Pradesh AP Politics