Hyderabad: స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు.. నలుగురు మహిళల అరెస్ట్

Police Arrested Four Women At Amrita Spa Center In Hyderabad
  • హైదరాబాద్‌లోని స్పా సెంటర్లలో విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలు
  • ఇటీవల వరుసగా దాడులు చేస్తున్న పోలీసులు
  • తాజాగా పక్కా సమాచారంతో అమృత హోటల్ స్పాపై దాడి
హైదరాబాద్‌లో స్పా సెంటర్ల మాటున అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు తాజాగా మరోమారు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. 

అమృత హోటల్ స్పా సెంటర్‌పై దాడులు నిర్వహించిన పోలీసులు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తించారు. స్పా సెంటర్ యజమానులపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. స్పా పేరుతో సెంటర్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు.
Hyderabad
Spa Centers
Police
Crime News

More Telugu News