నిర్మాత చినబాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి: పవన్ కల్యాణ్

  • టాలీవుడ్ నిర్మాత ఎస్.రాధాకృష్ణకు మాతృవియోగం
  • అనారోగ్యంతో కన్నుమూసిన సూర్యదేవర నాగేంద్రమ్మ
  • ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్న పవన్
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు)కు మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. రాధాకృష్ణ మాతృమూర్తి నాగేంద్రమ్మ తీవ్ర అనారోగ్యంతో నేడు కన్నుమూశారు. 

ఈ నేపథ్యంలో, టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. చినబాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. 

"ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) గారి మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీమతి నాగేంద్రమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. చినబాబు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

చినబాబు నిర్మాతగా హారిక అండ్ హాసిని బ్యానర్లో పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan
S.Radha Krishna
Chinababu
Producer

More Telugu News