చైనా సాయంతో జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాక్ రక్షణ సామర్థ్యం పెంపు!
- పాక్కు గత మూడేళ్లుగా సహకారం అందిస్తున్న చైనా
- ఉక్కు బంకర్ల నిర్మాణం సహా పలు యుద్ధ సామర్థ్యాల పెంపు
- చైనా సహాయంతో అత్యాధునిక రాడార్లు.. ఎల్ఓసీ వెంబడి ఫైబర్ కేబుళ్లు కూడా ఏర్పాటు
చైనా సహకారంతో అధునాతన రాడార్ సిస్టమ్లైన ‘జేవై’, ‘హెచ్జీఆర్’ సిరీస్లను పాకిస్థాన్ సిద్ధం చేసుకుంది. వీటి సహాయంతో మీడియం, తక్కువ ఎత్తులోని లక్ష్యాలను కూడా గుర్తించవచ్చు. సైన్యం, వైమానిక రక్షణ విభాగాలకు ఈ రాడార్లు కీలకమవనున్నాయి. చైనీస్ కంపెనీ తయారు చేసిన 155 ఎంఎం ట్రక్-మౌంటెడ్ హోవిట్జర్ గన్ ‘ఎస్హెచ్-15’లను కూడా నియంత్రణ రేఖ వెంబడి వివిధ ప్రదేశాలలో పాక్ మోహరించినట్టు గుర్తించినట్టు కథనాలు పేర్కొంటున్నాయి.
పాకిస్థాన్ రక్షణకు సంబంధించిన ఈ పరిణామాలతో చైనాతో సంబంధాలు మరింత బలపడనున్నాయని రక్షణరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సీపీఈసీలో (పాకిస్థాన్ చైనా ఎకనామిక్ కారిడార్) భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా పెట్టుబడులకు మార్గం సుగుమం చేస్తుందని చెబుతున్నారు.