ఎన్టీ రామారావు చిన్నప్పటి ఫొటో పంచుకున్న పట్టాభి
- నేడు ఎన్టీఆర్ 101వ జయంతి
- ఆయన జన్మించడం తెలుగువాడి అదృష్టం అంటూ పట్టాభి ట్వీట్
- నందమూరి తారక రాముడికి నివాళులు తెలుపుకుంటున్నట్టు వెల్లడి
"ఆయన జన్మించడం తెలుగువాడి అదృష్టం... ఆయన నటించడం సినీ తెరకే మహాభాగ్యం... ఆయన రాజకీయం పెను సంచలనం... ఆయన ఆహార్యమే తెలుగువాడి ఆత్మాభిమానం... అనితర సాధ్యుడు, అనన్య సామాన్యుడు, యుగపురుషుడు నందమూరి తారక రాముడు చిరస్మరణీయుడు... ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు" అంటూ పట్టాభి పేర్కొన్నారు.