BRS: శ్రీధర్ రెడ్డి హంతకులను శిక్షించండి: డీజీపీకి బీఆర్ఎస్ నేతల వినతి పత్రం

BRS leaders meet DGP over Sridhar Reddy murder
  • శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చిన ఆర్ఎస్పీ, ఇతర నేతలు
  • సామాన్యులకు రక్షణ కల్పించకపోతే హోంమంత్రి ఎందుకని ప్రశ్న
  • జూపల్లిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, కుమ్మక్కైన పోలీసులను డిస్మిస్ చేయాలని డిమాండ్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని హత్య చేసిన వారిని శిక్షించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు సోమవారం డీజీపీ రవిగుప్తాను కలిశారు. శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వారు డీజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే హోమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. సామాన్యులకు రక్షణ కల్పించకపోతే హోంమంత్రి ఎందుకన్నారు. చిన్నంబావి ఎస్సై మంత్రి జూపల్లి చేతిలో ఉన్నారని ఆరోపించారు.

జూపల్లితో కుమ్మక్కైన పోలీసులను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. అచ్చంపేట ప్రాంతాన్ని ప్యాక్షన్ జోన్‌గా ప్రకటించాలన్నారు. జూపల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. రేవంత్ రెడ్డి, జూపల్లి రక్తపుటేరులు పారిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరిగినా జూపల్లిపై చర్యలు లేవని మండిపడ్డారు. తమకు న్యాయం జరగకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తన కొడుకుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి తండ్రి వాపోయారు.

  • Loading...

More Telugu News