Vamsi: ఆ రోజున మా ఆవిడ నెక్లెస్ తాకట్టుపెట్టాను: డైరెక్టర్ వంశీ

Vamsi Interview
  • కిరాణా సరుకులకు డబ్బులు ఉండేవి కాదని వివరణ 
  • కమలావతి కథ మెప్పించిందన్న వంశీ 
  • ఆ కథను 'మహల్లో కోకిల'గా రాశానని వెల్లడి 
  • మొదటి బహుమతి తనకే దక్కిందని వ్యాఖ్య
    

వంశీ అంటే ఒక అనుభూతి పరిమళం. ఆయన కవితలోను .. కథలోను .. సినిమాల్లోను ప్రకృతి ఒక పాత్రను పోషిస్తుంది. అందువల్లనే ఆ సినిమాలు ఎన్నిసార్లు చూసినా కొత్తగానే కనిపిస్తుంటాయి. ఆ జ్ఞాపకాలలోకి మనలను చేయిపట్టుకుని తీసుకుని వెళుతుంటాయి. రీసెంటుగా చేసిన ఒక వీడియోలో ఆయన తనకి సంబంధించిన ఒక విషయాన్ని ప్రస్తావించారు. 

"మా రామరాజు వాళ్ల ఊళ్లో జరిగిన ఒక సంఘటన నాకు చెప్పాడు. ఆ ఊరి జమిందారు బంగ్లా నుంచి ఆ ఇంటి ఆడపడుచు కమలావతి ఓ రాత్రివేళ పడవలో పారిపోవడం గురించి విన్నాక, ఇంత సస్పెన్స్ ఏ సినిమాలోను ఉండదని అనిపించింది. ఆ సంఘటన గురించి ఆలోచిస్తూ ఇంటికి వస్తే, మా ఆవిడ కిరాణా సరుకులు తీసుకురమ్మని చెప్పింది. నా దగ్గర డబ్బులు లేకపోతే, వెయ్యి రూపాయలకు తన నెక్లెస్ తాకట్టుపెట్టాను" అని అన్నారు. 

"ఈ వెయ్యి రూపాయలతో ఒక నెల గడుస్తుంది .. తరువాత పరిస్థితి ఏంటి? అనిపించింది. అప్పుడే నవలల పోటీ అనే ప్రకటన చూశాను .. మొదటి బహుమతి పదివేలు. దాంతో కమలావతి కథను 'మహల్లో కోకిల' పేరుతో నవలగా రాసి పోటీకి పంపించాను. ఆ తరువాత పోస్టుమేన్ ను విసిగించాను. ఓ రోజున శుభవార్త వినిపించాడు. నా కథకు మొదటి బహుమతి వచ్చింది. ఇక ఏడాది ఫరవాలేదు అనుకున్నాను" అని చెప్పాడు. 

  • Loading...

More Telugu News