అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి
- మృతురాలిని గుంటిపల్లి సౌమ్యగా గుర్తింపు
- యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువతి
- స్వగ్రామం యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లె
యాదగిరిపల్లికి చెందిన సౌమ్య (25) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడి అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతోంది. చదువుకుంటూనే ఆమె పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సౌమ్య అక్కడికక్కడే మృతి చెందింది.