ఐపీఎల్ విజేత కోల్‌కతా డ్రెస్సింగ్ రూమ్ సెలబ్రేషన్స్ చూశారా?.. ఇదిగో వీడియో!
- తెల్లవారుజామున 2 గంటల వరకు కేకేఆర్ ప్లేయర్ల సెలబ్రేషన్స్
- పంజాబీ మ్యూజిక్, షాంపైన్ షవర్‌తో కోల్‌కతా ఆటగాళ్ల సంబరాలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ సంబరాలకు ముందు వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, నితీష్ రానా, రింకూ సింగ్ అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. అంతకుముందు ఐపీఎల్ ట్రోఫీతో పాటు ఫ్యామిలీ పిక్చర్ కోసం కేకేఆర్ జట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ సమయంలో గౌతీ ఇద్దరు కుమార్తెలు, భార్య అతనితో ఉన్నారు. ఈ ముగ్గురూ 'ఛాంపియన్స్ ఆఫ్ 2024' టీషర్టులు ధరించడం కనిపించింది. ఇలా దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన సెలబ్రేషన్స్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ ఆటగాళ్లు తెల్లవారుజామున 2 గంటల వరకు సంబరాలు చేసుకున్నారు. కేక్ కటింగ్ తర్వాత ప్లేయర్లు పంజాబీ మ్యూజిక్‌పై డ్యాన్సులతో హోరెత్తించారు. షాంపైన్ షవర్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను తడిపేశారు.