Shah Rukh Khan: ఐపీఎల్ పైనల్‌కు పోటెత్తిన సినీ తారలు

- సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్
- స్టేడియంలో మెరిసిన షారూఖ్, వెంకటేశ్, అనన్య పాండే, జాన్వీ కపూర్ తదితరులు
- క్రికెటర్లను ఉత్సాహపరిచిన సినీ స్టార్లు
ఐపీఎల్ ఫైనల్‌ను కనులారా వీక్షించేందుకు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖ సినీ తారలు పోటెత్తారు. వెంకటేశ్, రాజ్‌కుమార్‌రావు, జాన్వీకపూర్, అనన్యపాండే, మహేశ్వరి తదితర నటులు అభిమానులతో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. కోల్‌కతా ఫ్రాంచైజీ యజమాని షారూఖ్‌ఖాన్, ఆయన భార్య గౌరీఖాన్, కుమార్తె సుహానాఖాన్, జుహీచావ్లా తదితరులు గ్యాలరీ నుంచి జట్టును ప్రోత్సహించారు. జట్టు వికెట్లు తీసిన, సిక్సర్లు బాదిన ప్రతిసారి చప్పట్లతో హోరెత్తించారు.


