హైదరాబాదులో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం
- గత కొన్ని రోజులుగా హైదరాబాదులో తీవ్ర ఎండలు
- ఉదయం నుంచి ఎండ వేడిమి
- సాయంత్రానికి మారిన వాతావరణం
ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాచారం, హబ్సీగూడ, తుర్కయాంజాల్, నల్లకుంట, కాచిగూడ, మల్కాజ్ గిరి, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి.