Hyderabad: హైదరాబాదులో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం

Hyderabad gets a rain in severe heatwave
  • గత కొన్ని రోజులుగా హైదరాబాదులో తీవ్ర ఎండలు
  • ఉదయం నుంచి ఎండ వేడిమి
  • సాయంత్రానికి మారిన వాతావరణం

గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులకు ఈ సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. నగరంలో సాయంత్రం వరకు ఎండ మండిపోగా, సాయంత్రానికి వాతావరణంలో మార్పు వచ్చింది. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. 

ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాచారం, హబ్సీగూడ, తుర్కయాంజాల్, నల్లకుంట, కాచిగూడ, మల్కాజ్ గిరి, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి.

  • Loading...

More Telugu News