IPL 2020: సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్... రెండూ సమవుజ్జీలే!

SRH and KKR have equal record in IPL
  • సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్... ఇద్దరూ సమవుజ్జీలే!
  • ఇప్పటివరకు రెండుసార్లు టైటిల్ నెగ్గిన హైదరాబాద్
  • కోల్ కతా కూడా రెండు పర్యాయాలు ఐపీఎల్ విజేతగా నిలిచిన వైనం
  • ఇరు జట్లు చెరో నాలుగు సార్లు ఫైనల్ కు చేరిక
  • నేడు ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ లో టైటిల్ కోసం ఎస్ఆర్ హెచ్, కేకేఆర్ అమీతుమీ

ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇవాళ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. 

ఇక, రికార్డుల పరంగా చూస్తే సన్ రైజర్స్, కోల్ కతా జట్లు రెండూ సమవుజ్జీలే అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు చెరో నాలుగు సార్లు ఫైనల్ చేరాయి. చెరో రెండు సార్లు ఐపీఎల్ విజేతలుగా నిలిచాయి. మూడో టైటిల్ కోసం నేడు అమీతుమీకి సిద్ధమయ్యాయి.

హైదరాబాద్ జట్టు 2009, 2016, 2018, 2024లో ఫైనల్ చేరగా... 2009, 2016లో టైటిల్ గెలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ 2012, 2014, 2021, 2024లో ఫైనల్ చేరగా... 2012, 2014లో ఐపీఎల్ విజేతగా నిలిచింది.

మరి 2024 టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్ చేరిన నేపథ్యంలో... విజేత ఎవరన్నది ఆసక్తి కలిగిస్తోంది. కాగా, హైదరాబాద్ జట్టు 2009లో డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీగా ఉంది. ఆ తర్వాత కాలంలో సన్ గ్రూప్ హైదరాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకోవడం తెలిసిందే.

  • Loading...

More Telugu News