Teacher: హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో ఏపీ ఉపాధ్యాయుడి మృతి

AP teacher dies in Hyderabad
  • రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జయప్రకాశ్
  • మియాపూర్ లో ఓయో లాడ్జిలో విగతజీవుడిగా కనిపించిన వైనం
  • విషం మాత్రలు మింగినట్టు లాడ్జిలో ఆనవాళ్లు 

ఏపీకి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ ఉపాధ్యాయుడిని రాయచోటికి చెందిన జయప్రకాశ్ గా గుర్తించారు. జయప్రకాశ్ మియాపూర్ లోని ఓయో లాడ్జిలో విగతజీవుడిగా కనిపించాడు. ఉపాధ్యాయుడు జయప్రకాశ్ విషం మాత్రలు మింగినట్టుగా లాడ్జి గదిలో ఆనవాళ్లు కనిపించాయి. ఘటన స్థలిని పరిశీలించిన పోలీసులు హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News