Telangana Schools: తెలంగాణలో బడుల వేళల్లో మార్పు.. అరగంట ముందుగానే తెరుచుకోనున్న తలుపులు

Telangana govt changes school timings for this academic year
  • ఉదయం 9 గంటలకే పాఠశాలలు
  • సాయంత్రం 4 గంటలకు మూత
  • ప్రభుత్వ బడులపై చులకన భావం పోగొట్టేందుకే
  • హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం 8.45 గంటలకే తెరుచుకోనున్న బడులు
  • ఈ విద్యా సంవత్సరంలో 229 రోజులపాటు తరగతులు

బడి వేళ్లలో మార్పులు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9.30 గంటలకు తెరుచుకుంటుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి అరగంట ముందుగానే, అంటే ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో చులకన భావం ఏర్పడుతోందని గ్రహించిన ప్రభుత్వం వేళలను సవరించింది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం ఉదయం 8.45 గంటలకే బడులు ప్రారంభమై మధ్యాహ్నం 3.45 గంటల వరకు కొనసాగుతాయి.

ఇతర ప్రాంతాల్లో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉదయం 9 గంటలకు స్కూళ్లు తెరుచుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు మూతబడతాయి. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఒకే ప్రాంగణంలో ఉంటే మాత్రం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 వరకు తరగతులు కొనసాగుతాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉంటే ఉన్నత పాఠశాలల వేళలనే పాటించాల్సి ఉంటుంది. అంటే ఉదయం 9.30 గంటలకు తెరుచుకుంటాయి. మధ్యాహ్న భోజనం కోసం 45 నిమిషాల విరామం ఇస్తారు.

ఇక ఈ విద్యాసంవత్సరం జూన్ 12న ప్రారంభమై వచ్చే ఏడాది ఏప్రిల్ 23న ముగుస్తుంది. మొత్తంగా 229 రోజులపాటు తరగతులు కొనసాగుతాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తారు.

  • Loading...

More Telugu News