బాలీవుడ్ నటి దిశా పటానీ బాయ్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా భార్య నటాషా.. విడాకులు ఖాయమే!
- పాండ్యాతో విడాకుల వార్తలపై తొలిసారి స్పందించిన నటాషా స్టాంకోవిక్
- విడాకులపై అడిగిన ప్రశ్నకు నవ్వేసి ‘థ్యాంక్యూ’ అనేసి వెళ్లిపోయిన నటాషా
- ఈ దెబ్బతో స్పష్టత వచ్చేసిందంటున్న నెటిజన్లు
పాండ్యా-నటాషా కరోనా లాక్‌డౌన్ సమయంలో మే 2020లో వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల అగస్త్య పాండ్యా అనే కుమారుడు ఉన్నాడు. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి పాండ్యా అనే పేరును తొలగించడాన్ని గుర్తించిన నెటిజన్లు వీరిద్దరూ విడిపోబోతున్నారని పోస్టులు పెట్టడంతో ఆ వార్త వైరల్ అయింది. గతంలో నటాషా ఇన్‌స్టాలో నటాషా స్టాంకోవిక్ పాండ్యా అని ఉండేది. ప్రస్తుతం నటాషా స్టాంకోవిక్‌గానే కనిపిస్తోంది.
మార్చి 4న ఆమె బర్త్ డే నాడు కూడా పాండ్యా ఎలాంటి విషెస్ చెప్పకపోవడం విడాకుల వార్తలకు మరింత ఊతమిచ్చింది. అలాగే నటాషా కూడా కుమారుడి ఫొటోలు తప్ప పాండ్యాతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా నుంచి తొలగించింది.
ఐపీఎల్‌లో పాండ్యా ముంబైకి సారథ్యం వహించాడు. ముంబై మ్యాచ్‌ల సమయంలోనూ నటాషా ఎక్కడా స్టాండ్స్‌లో కనిపించలేదు. ముంబైకి మద్దతుగా పోస్టులు కూడా పెట్టలేదు. మరోవైపు, అటు నటాషా కానీ, ఇటు పాండ్యా కానీ ఎక్కడా తమ విడాకులపై బహిరంగంగా స్పందించలేదు.