Moye moye moment: చేతిపై కమలం టాటూ.. ఓటు ఎవరికంటే ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ అభిమాని.. వీడియో ఇదిగో!

Congress Shares Video Of A Man With Lotus Tattoo Dont Miss The End
  • బీజేపీకి ‘మోయె మోయె మూమెంట్’ అంటూ వీడియో షేర్ చేసిన కాంగ్రెస్
  • జూన్ 4న ప్రధాని మోదీ, అధికార బీజేపీల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని వ్యాఖ్య
  • ఇండియా కూటమిదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ
ముచ్చటగా మూడోసారి అధికారం తమదేనంటూ బీజేపీ చేస్తున్న ప్రకటనలన్నీ నీటిమూటలేనని కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పింది. ఆ పార్టీకి వాళ్ల అభిమానులే ఓటేయడంలేదని చెప్పింది. ఈమేరకు బీజేపీ అభిమాని ఒకరు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. బీజేపీకి, మోదీకి ఇది మోయె మోయె మూమెంట్ అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.

శనివారం దేశవ్యాప్తంగా ఆరో దశ పోలింగ్ జరుగుతుండగా మీడియా పలువురు ఓటర్లతో మాట్లాడుతూ లైవ్ చూపెడుతోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి పోలింగ్ కేంద్రం వైపు వెళుతుండగా ఆపి, ఆయన చేతిపై ఉన్న కమలం గుర్తును మీడియా ప్రతినిధి చూపించాడు. నిజమైన అభిమానం ఇలా ఉంటుందని చెబుతూ.. ఆ అభిమానికి పలు ప్రశ్నలు సంధించాడు.

సంభాషణ పూర్తయ్యే దశలో ఎవరికి ఓటేయబోతున్నారంటూ అడగగా.. కాంగ్రెస్ కే నా ఓటు అంటూ సదరు అభిమాని ట్విస్ట్ ఇవ్వడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేస్తూ.. జూన్ 4న వెలువడే ఫలితాల్లో కూడా ఇలాంటి ట్విస్టే చోటుచేసుకుంటుందని, బీజేపీకి షాక్ తప్పదని క్యాప్షన్ జోడించింది. ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
Moye moye moment
Congress
BJP
Instagram
Viral Videos

More Telugu News