Manchu Vishnu: రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమపై నిరాధార ఆరోపణలు చేయొద్దు: మంచు విష్ణు

Manchu Vishnu tries to condemn allegations on actress Hema
  • రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో హేమ ఉందన్న బెంగళూరు పోలీసులు
  • డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్... ఇప్పటికే ఆమెకు నోటీసులు
  • నిజానిజాలు నిర్ధారణ చేసుకుని వార్తలు రాయాలన్న మా అధ్యక్షుడు

బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ కూడా పాల్గొన్నట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించడం తెలిసిందే. ఆమె డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులు పంపించినట్టు వార్తలు వచ్చాయి. 

అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు నటి హేమపై వస్తున్న వార్తలను ఖండించే ప్రయత్నం చేశారు. ఇటీవల డ్రగ్స్ వ్యవహారంతో కూడిన రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమపై కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంచు విష్ణు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

నిజనిర్ధారణ చేసుకోకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని తెలిపారు. నేరం నిరూపితమయ్యే వరకు హేమను ఒక నిర్దోషిగానే భావించాల్సి ఉంటుందని మంచు విష్ణు స్పష్టం చేశారు. ఆమె ఒక తల్లి, ఒక భార్య... పుకార్ల ఆధారంగా ఆమె ఇమేజ్ ను దెబ్బతీసేలా వ్యవహరించడం అన్యాయం అని పేర్కొన్నారు. 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని... హేమ తప్పు చేసినట్టు పోలీసులు కచ్చితమైన సాక్ష్యాధారాలు అందిస్తే 'మా' తగిన చర్యలు తీసుకుంటుందని మంచు విష్ణు స్పష్టం చేశారు. అప్పటి వరకు సంచలనాత్మక వార్తలను, నిరాధార వార్తలను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News