PV Sindhu: మలేసియా మాస్టర్స్ టోర్నీ టైటిల్ కు అడుగు దూరంలో పీవీ సింధు

PV Sindhu enters Malaysia Masters Badminton tourney final
  • కౌలాలంపూర్ వేదికగా మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
  • నేడు సెమీఫైనల్లో థాయ్ లాండ్ అమ్మాయి బుసానన్ ను ఓడించిన సింధు
  • రేపు ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ ఝి యీతో అమీతుమీ

భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధు మలేసియా మాస్టర్స్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. కౌలాలంపూర్ లో ఇవాళ జరిగిన సెమీఫైనల్ పోరులో సింధు థాయ్ లాండ్ షట్లర్ బుసానన్ పై విజయం సాధించింది.

మూడు గేముల పాటు సాగిన ఈ పోరులో సింధు 13-21, 21-16, 21-12 తేడాతో నెగ్గింది. తొలి గేమును ప్రత్యర్థికి చేజార్చుకున్న సింధు... ఆ తర్వాత వరుసగా రెండు గేములు కైవసం చేసుకుని విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ దాదాపు 88 నిమిషాల పాటు సాగింది. 

ఆదివారం నాడు జరిగే ఫైనల్లో సింధు చైనాకు చెందిన వాంగ్ ఝి యీతో తలపడనుంది.

  • Loading...

More Telugu News