Revanth Reddy: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రేవంత్ రెడ్డి

CM Revanth Reddy at command control center
  • సీఎంకు స్వాగతం పలికిన డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
  • సైబర్ సెక్యూరిటీ, నార్కోటింగ్ వింగ్‌లపై సమీక్ష
  • తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినపడకూడదన్న ముఖ్యమంత్రి

తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినపడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చారు. ముఖ్యమంత్రికి డీజీపీ రవి గుప్తా, సీఎస్ శాంతికుమారి స్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారి ఆయన ఇక్కడకు వచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సైబర్ సెక్యూరిటీ, నార్కోటింగ్ వింగ్‌లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నార్కోటిక్ డ్రగ్స్ విభాగం పనితీరుపై ఆయన సమీక్షించారు.

  • Loading...

More Telugu News