Jai Shah: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీసీఐ కార్యదర్శి జై షా

Jai Shah visits Tirumala
  • కుటుంబంతో కలిసి తిరుమల విచ్చేసిన అమిత్ షా తనయుడు
  • తల్లి సోనాల్ షాతో కలిసి శ్రీవారి దర్శనం
  • జై షా కుటుంబానికి తీర్థప్రసాదాలు అందించిన టీటీడీ వర్గాలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జై షా నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల విచ్చేసిన జై షాకు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. స్వామి వారి దర్శనం తర్వాత సంప్రదాయబద్ధంగా ఆయనకు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. జై షా వెంట ఆయన తల్లి సోనాల్ షా కూడా ఉన్నారు. 

జై షా... ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి మాత్రమే కాదు... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు కూడా. ఇటీవలే మూడోసారి ఏసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు.

  • Loading...

More Telugu News