Shimron Hetmyer: స్టంప్స్‌పై ప్రతాపం.. రాజస్థాన్ స్టార్ బ్యాటర్ హెట్మెయిర్‌కు జరిమానా

RR Star Shimron Hetmyer Gets Slapped With Fine After Elimination
  • అభిషేక్ శర్మ బౌలింగ్‌లో హెట్మెయిర్ బౌల్డ్
  • ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక స్టంప్స్ విరగ్గొట్టే ప్రయత్నం
  • తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్
  • మ్యాచ్ ఫీజులో పదిశాతం కోత

రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు షిమ్రన్ హెట్మెయిర్‌కు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ ఐపీఎల్ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఈ చర్యలు తీసుకుంది. గత రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 36 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 

హెట్మెయిర్ ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినట్టు పేర్కొన్నప్పటికీ అది ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే, అవుట్‌పై అతిగా ప్రతిస్పందించడం వల్లే అయి ఉంటుందని తెలిసింది. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన హెట్మెయిర్ ఫ్రస్ట్రేషన్‌తో స్టంప్స్‌పై ప్రతాపం చూపించాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అతడి మ్యాచ్ ఫీజులో కోత విధించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News