Jaishankar: ఓటేసి సర్టిఫికెట్ అందుకున్న కేంద్ర మంత్రి జైశంకర్.. వీడియో ఇదిగో!

Foreign Minister S Jaishankar Gets A Certificate For Voting
  • గేటు తెరవకముందే వెళ్లి లైన్ లో నిలుచున్న కేంద్ర మంత్రి
  • ఫస్ట్ మేల్ ఓటర్ సర్టిఫికెట్ ఇచ్చిన పోలింగ్ సిబ్బంది
  • కేంద్ర మంత్రి కంటే ముందు ఓటేసిన వృద్ధురాలు

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరో దశ పోలింగ్ కొనసాగుతోంది. దేశ రాజధానిలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే వెళ్లి పోలింగ్ బూత్ గేటు తెరవక ముందే లైన్ లో నిలుచున్న మంత్రి.. ఓ వృద్ధురాలికి ముందు అవకాశం ఇచ్చి, తర్వాత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సదరు పోలింగ్ బూత్ సిబ్బంది కేంద్ర మంత్రికి ఓ సర్టిఫికెట్ అందించారు. దానిని చూపిస్తూ జైశంకర్ ఫొటో దిగి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇంతకీ అది ఏం సర్టిఫికెట్ అనుకుంటున్నారా.. ఆ పోలింగ్ బూత్ లో ఓటేసిన ఫస్ట్ మేల్ ఓటర్ కావడంతో కేంద్ర మంత్రికి ఈ సర్టిఫికెట్ అందించారట.

ఓ చేతిలో ‘ప్రౌడ్ టు బి ఫస్ట్ మేల్ ఓటర్ ’ సర్టిఫికెట్, మరో చేతి వేలికి సిరా గుర్తును చూపిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ లో ఫొటో షేర్ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ కు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కేంద్ర మంత్రి ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. కాగా, ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. దీంతో పాటు బీహార్ (8 సీట్లు), బెంగాల్ (8 సీట్లు), హర్యాణా (10 సీట్లు), ఝార్ఖండ్ (4 సీట్లు), ఉత్తరప్రదేశ్ (14 సీట్లు), జమ్మూ కశ్మీర్ లోని ఒక సీటుకు పోలింగ్ జరుగుతోంది. మొత్తంగా ఆరో దశలో 58 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.

  • Loading...

More Telugu News