Droupadi Murmu: కొనసాగుతున్న ఆరవ దశ పోలింగ్.. ఓటేసిన రాష్ట్రపతి, పలువురు ప్రముఖులు

President Draupadi murmu casts vote in 6 phase elections
  • ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలింగ్
  • ఉదయం 9 గంటలకు సగటున 10 శాతం పోలింగ్ నమోదు
  • ఢిల్లీలో ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు   

దేశంలో ఆరవ విడత పోలింగ్ కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఢిల్లీలో ఉదయం 9 గంటల వరకూ సగటున 10 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలో 8.94 శాతం పోలింగ్ నమోదవగా పశ్చిమ బెంగాల్‌లో గరిష్ఠంగా 16.54 పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో 889 మంది కాండిడేట్ల భవిష్యత్తును 11 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు.  

కాగా, ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ఓటు వేశారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావ్ ఇందర్‌జిత్ సింగ్, మంత్రి జైశంకర్ బీజేపీ నేత మేనకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ ఖట్టర్, మనోజ్ తివారీ, మహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్, మాజీ క్రికెటర్ బీజేపీ నేత గౌతం గంభీర్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News