SRH: క్లాసెన్ ఫిఫ్టీ... రాజస్థాన్ కు 176 రన్స్ టార్గెట్ ఇచ్చిన సన్ రైజర్స్

SRH set Rajasthan Royals 176 runs target
  • చెన్నైలో ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్
  • సన్ రైజర్స్ × రాజస్థాన్ రాయల్స్
  • గెలిచిన జట్టు ఫైనల్లో కోల్ కతాతో అమీతుమీ

ఐపీఎల్ ఫైనల్ చేరాలని తపిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు... రాజస్థాన్ రాయల్స్ ముందు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నేడు చెన్నైలో క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. 

ఇక, నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 50 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

క్లాసెన్ 34 బంతుల్లో 50 పరుగులు చేసి సందీప్ శర్మ విసిరిన యార్కర్ కు బౌల్డయ్యాడు. క్లాసెన్ తన ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు కొట్టగా, బ్యాక్ ఫుట్ మీద కొట్టిన ఆ షాట్లు కామెంటేటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. 

అంతకుముందు, సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 34, రాహుల్ త్రిపాఠి 37 పరుగులతో రాణించారు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ 18 పరుగులు చేశాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (12), ఐడెన్ మార్ క్రమ్ (1), నితీశ్ రెడ్డి (5), అబ్దుల్ సమద్ (0) విఫలమయ్యారు. 

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, అవేష్ ఖాన్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు.

  • Loading...

More Telugu News