Hyderabad: హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్... మెట్రో రైలు వేళల పొడిగింపు!

Hyderabad Metro extended service on Fridays
  • మెట్రో రైలు ప్రయాణవేళల్లో స్వల్ప మార్పు
  • ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సర్వీసులు ఉంటాయని వెల్లడి
  • ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో
భాగ్యనగరవాసులకు హైదరాబాద్ మెట్రో రైలు శుభవార్త చెప్పింది. మెట్రో రైలు ప్రయాణవేళల్లో స్వల్ప మార్పు చేసింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు మెట్రో రైలు సర్వీస్‌లు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రతి శుక్రవారం మెట్రో ప్రయాణ వేళలను పొడిగించినట్లు తెలిపింది. పొడిగించిన సర్వీస్ వేళలతో లేట్ మీటింగ్స్, ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఇక మీకు అడ్డుండవు ... మీ బ్యాగ్‌లను ప్యాక్ చేసి మెట్రో ఎక్కండని ట్వీట్ చేసింది.

హైదరాబాద్ మెట్రో ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి రైళ్ల రాకపోకలను నిర్వహించేలా ఇటీవల అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తాజాగా, శుక్రవారాల్లో రాత్రి 11.45 గంటల వరకు సర్వీసును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
Hyderabad
Metro
Hyderabad Metro

More Telugu News