E-Pragati: ఏపీ రవాణా శాఖ వెబ్ సైట్ 'ఈ-ప్రగతి' పునరుద్ధరణ

E Pragati website renewed
  • రవాణా శాఖ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్న ఓటీఎస్ఐ సంస్థ
  • రూ.18 కోట్ల బకాయి పడిన రాష్ట్ర ప్రభుత్వం
  • నిన్నటి నుంచి సేవలు నిలిపివేసిన ఓటీఎస్ఐ
  • ఓటీఎస్ఐ ప్రతినిధులతో అధికారుల చర్చలు సఫలం
  • నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి ఈ-ప్రగతి వెబ్ సైట్ సేవలు

బకాయిలు చెల్లించని నేపథ్యంలో, నిన్నటి నుంచి నిలిచిపోయిన ఏపీ రవాణా శాఖ వెబ్ సైట్ 'ఈ-ప్రగతి'ని నేడు పునరుద్ధరించారు. ఈ వెబ్ సైట్ కు ఓటీఎస్ఐ అనే సంస్థ సర్వీస్ ప్రొవైడర్ గా వ్యవహరిస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి రూ.18 కోట్ల బకాయిలు రావాల్సి ఉందంటూ, ఓటీఎస్ఐ నిన్నటి నుంచి క్లౌడ్ యాక్సెస్ సేవలు నిలిపివేసింది. 

దాంతో 'ఈ-ప్రగతి' వెబ్ సైట్ కొన్ని గంటలుగా స్తంభించిపోయింది. వాహనదారులు వివిధ రకాల సేవలు లభించక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాహనాల బదిలీ, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, ఎన్ఓసీ, రెన్యువల్ వంటి సేవలు, ఈ-చలాన్ చెల్లింపులు, ఈ-పర్మిట్ల కేటాయింపు నిలిచిపోయాయి. 

అధికారులు వెంటనే స్పందించి ఓటీఎస్ఐ ప్రతినిధులతో చర్చించారు. అధికారుల చర్చలు ఫలించడంతో వెబ్ సైట్ పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. 

రవాణా శాఖ డేటా మొత్తం ఓటీఎస్ఐ సంస్థ క్లౌడ్ స్టోరేజి ద్వారా పర్యవేక్షిస్తోంది. అందులో భాగంగానే ఈ-ప్రగతి వెబ్ సైట్ కార్యకలాపాలు కూడా ఈ సంస్థకే అప్పగించారు. క్లౌడ్ స్టోరేజి సేవలకు సంబంధించి ఏడాదిన్నరగా ప్రభుత్వం ఓటీఎస్ఐ సంస్థకు రూ.18 కోట్ల బకాయి పడింది. 

దాంతో, ఓటీఎస్ఐ సంస్థ క్లౌడ్ స్టోరేజి సేవలు నిలిపివేసింది. ఈ క్రమంలోనే ఈ-ప్రగతి వెబ్ సైట్ కూడా నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News