YS Sharmila: లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు ఇక్కడి ఆర్తనాదాలు వినిపించవు: సీఎం జగన్ పై షర్మిల ఫైర్

YS Sharmila take a dig at CM Jagan
  • ఏలూరు జిల్లాలో పదో తరగతి బాలికపై అత్యాచారం
  • ఫేక్ ప్రేమలు నటించే సీఎం గారూ అంటూ ధ్వజమెత్తిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు
  • సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అంటూ విమర్శలు

ఏలూరు జిల్లాలో ఓ పదో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై ధ్వజమెత్తారు. 

లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు అని షర్మిల విమర్శించారు. 

"నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు, నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారూ... మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, మహిళల బ్రతుకులకు పట్టిన పీడ గురించి దేశమంతా చెప్పుకుంటోంది. 

రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో... సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు" అంటూ షర్మిల సోషల్ మీడియాలో  స్పందించారు.

  • Loading...

More Telugu News