Election Commission: ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల్లో 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు మూసివేత

Wine shops closed in warangal khammam and nalgonda from tomorrow
  • గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖకు పోలీసు అధికారుల ఆదేశాలు
  • రేపు సాయంత్రం 4 నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు దుకాణాల బంద్
  • 27న గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికలకు పోలింగ్

ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. అయితే పోలింగ్ జరిగే మూడు ఉమ్మడి జిల్లాల్లో ఈ దుకాణాలు బంద్ చేయనున్నారు. మే 27న పోలింగ్ ఉంది. దీంతో రేపు సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 4,61,806 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు.

  • Loading...

More Telugu News