Nara Lokesh: పిన్నెల్లి బ్రదర్స్ నరరూప రాక్షసులు... 20 ఏళ్లుగా మారణహోమం సాగిస్తున్నారు: నారా లోకేశ్

Nara Lokesh fires on Pinnelli brothers
  • ఎన్నికల వేళ భగ్గుమన్న మాచర్ల
  • ఈవీఎం ధ్వంసం చేసి పరారీలో ఉన్న పిన్నెల్లి
  • ప్రజలు, ప్రజాస్వామ్యం బతకాలంటే పిన్నెల్లి బ్రదర్స్ ను అరెస్ట్ చేయాలన్న లోకేశ్

మాచర్ల నియోజకవర్గంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. పిన్నెల్లి సోదరులు నరరూప రాక్షసులు అని ధ్వజమెత్తారు. 

మాచర్ల నియోజకవర్గంలో 20 ఏళ్లుగా మారణహోమం సాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు బతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

టీడీపీకి మద్దతు ఇస్తున్నారన్న కారణంతో ఊర్లకు ఊర్లు తగలబెడుతూ, కుటుంబాలను మట్టుబెడుతోన్న పిన్నెల్లి బ్రదర్స్ అక్రమాలకు చరమగీతం పాడాలని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. నోముల మాణిక్యరావు అనే బాధితుడు పిన్నెల్లి సోదరుల అరాచకాల గురించి వివరించిన వీడియోను కూడా లోకేశ్ పంచుకున్నారు.

  • Loading...

More Telugu News