Telangana: తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Telangana POLYCET schedule released
  • జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
  • జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు
  • జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు
  • జులై 7న రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం
  • జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు, జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు

తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు విడతల్లో కౌన్సెలింగ్ వుంటుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. జులై 7న రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు, జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు వుంటాయి. ఇంటర్నల్ స్లైడింగ్‌ని కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కి అవకాశమిచ్చారు. జులై 24న సీట్లను కేటాయించి... జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలను విడుదల చేస్తారు.

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలవుతుంది. జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు, జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు వుంటాయి. మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు. జులై 19న రెండో విడత కౌన్సెలింగ్, జులై 24న సీట్ల కేటాయింపు వుంటాయి. జులై 30న ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ చేబట్టి, ఆగస్ట్ 5న తుది విడత సీట్లను కేటాయించనున్నారు.

  • Loading...

More Telugu News