Flight: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం.. బెంబేలెత్తించిన హైదరాబాద్ ప్రయాణికుడు

Passenger allegedly try to open running flight door
  • మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం
  • డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అడ్డుకున్న సిబ్బంది
  • నిందితుడిని గాజులరామారానికి చెందిన అనిల్‌గా గుర్తించిన పోలీసులు

మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు కలకలం రేపాడు. ప్రయాణం మధ్యలో విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు.

నిందితుడిని హైదరాబాద్ శివారులోని గాజులరామారం ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ అనిల్‌గా గుర్తించారు. విమానం డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన అనిల్‌పై విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడికి నోటీసులు ఇచ్చి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News