KTR: నకిలీ వార్తలు ప్రచారం చేసే వ్యక్తిని జైల్లో ఎందుకు పెట్టకూడదు?: రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్న

Why shouldnt this Habitual Fake News Peddler be put in a Jail
  • తన బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని సీఎం ఆరోపించారన్న కేటీఆర్
  • సచివాలయం కింద నిజాం నగలు తవ్వుకున్నట్లుగా కథలు అల్లారని మండిపాటు
  • కేంద్ర హోంమంత్రి ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేశారని విమర్శ
  • ఓయూకు చెందిన నకిలీ సర్క్యులర్‌ను పోస్ట్ చేశారన్న మాజీ మంత్రి

నకిలీ వార్తలు ప్రచారం చేసే వ్యక్తిని జైల్లో ఎందుకు పెట్టకూడదు? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా శుక్రవారం ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ నాలుగు అంశాలను పేర్కొన్నారు.

తన బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ కాంట్రాక్ట్ వచ్చిందని సీఎం ఆరోపించారని... ఆ తర్వాత సచివాలయం కింద నిజాం నగలు తవ్వుకున్నట్లుగా కథలు అల్లారని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి (అమిత్ షా) ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేశారని విమర్శించారు. అలాగే ఓయూకు చెందిన నకిలీ సర్క్యులర్‌ను పోస్ట్ చేశారన్నారు. ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.

కొత్త ఆర్టీసీ లోగో అంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన కేటీఆర్

టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇంకా లోగోను అధికారికంగా విడుదల చేయలేదన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తోన్న లోగోకు సంబంధం లేదన్నారు. ఈ అంశంపై కూడా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కొత్త లోగో అని చూపుతున్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. రాజకీయ పెద్దల మాటలు విని సామాన్యులను వేధిస్తే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. టీజీఆర్టీసీ లోగో అని వాట్సాప్ గ్రూప్‌లో కాంగ్రెస్ వారే షేర్ చేసి... ఆ తర్వాత అక్రమ కేసులు పెట్టేది వారేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇలా ఉందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News