Ambati Rambabu: మంత్రి అంబటి పిటిషన్ ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

AP High Court dismisses minister Ambati Rambabu petition
  • ఏపీలో మే 13న పోలింగ్
  • సత్తెనపల్లిలో 4 బూత్ లలో రీపోలింగ్ జరపాలన్న అంబటి
  • హైకోర్టులో అంబటికి చుక్కెదురు
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సత్తెనపల్లిలోని  4 బూత్ లలో రీపోలింగ్  జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అంబటి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 

అటు, చంద్రగిరిలో స్క్రూటినీ రీ షెడ్యూల్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కూడా నిరాశ తప్పలేదు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
Ambati Rambabu
AP High Court
Re Polling
Sattenapalle
YSRCP

More Telugu News